‘బీసీ కులాల సమస్యలు పరిష్కరించుకునేందుకు వేదిక కల్పించారు’
ABN , First Publish Date - 2020-12-17T17:14:07+05:30 IST
‘బీసీ కులాల సమస్యలు పరిష్కరించుకునేందుకు వేదిక కల్పించారు’

అమరావతి: విజయవాడలో బీసీల సంక్రాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడారు. ఏలూరులో సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. బ్యాక్ బోన్ క్యాష్ట్‌గా సీఎం బీసీలను బలపరిచారని పేర్కొన్నారు. బీసీ కులాల సమస్యలు పరిష్కరించుకునేందుకు వేదిక కల్పించారని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన నాయకులు మాటలు తప్ప.. చర్యలు శూన్యమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను సీఎం నిలబెట్టుకుంటారని చెప్పారు.