దేవినేని ఉమపై మండిపడ్డ మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-05-18T00:16:28+05:30 IST
టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి అనిల్ మండిపడ్డారు. ‘‘దేవినేనికి బుద్ధి లేదు.. నేను బూతులు మాట్లాడుతున్నానని అంటున్నారు. బుర్ర తక్కువ, నెల తక్కువ అంటే బూతులు కాదు

నెల్లూరు: టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి అనిల్ మండిపడ్డారు. ‘‘దేవినేనికి బుద్ధి లేదు.. నేను బూతులు మాట్లాడుతున్నానని అంటున్నారు. బుర్ర తక్కువ, నెల తక్కువ అంటే బూతులు కాదు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానిపై గతంలో ఏం మాట్లాడారో దేవినేని గుర్తుకు తెచ్చుకోవాలి. పోతిరెడ్డిపాడుపై ఇంత జరుగుతున్నా టీడీపీ వైఖరేంటో చెప్పడంలేదు. పేదల దగ్గర కమీషన్లు రావనే పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టివ్వలేదు’’ అని అనిల్ ఆరోపించారు.