జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోంది: అంగర రామ్మోహన్
ABN , First Publish Date - 2020-12-15T23:30:46+05:30 IST
రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం దివాళా తీయిస్తోందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. వ్యక్తులు, కంపెనీలు ఐపీ పెట్టడం ..
ప.గో: రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం దివాళా తీయిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. వ్యక్తులు, కంపెనీలు ఐపీ పెట్టడం చూశాం.. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఐపీ పెట్టబోతుందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధికి లక్షా పాతిక వేల కోట్లు అప్పుచేశారని.. జగన్ ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పాతాళంలోకి పడిపోయిందని విమర్శించారు. మద్యపాన నిషేధం అంటూనే మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంతో వడ్డీలు కడతామంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వల్లే ఏలూరు ఘటన జరిగిందని ఈఘటనకు ముమ్మాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడతున్నారని పేర్కొన్నారు.