మౌనదీక్షలో మాజీ మంత్రి రఘువీరా

ABN , First Publish Date - 2020-03-25T21:05:29+05:30 IST

జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠపురంలో మాజీ మంత్రి రఘువీరా మౌన దీక్ష చేపట్టారు.

మౌనదీక్షలో మాజీ మంత్రి రఘువీరా

అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠపురంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డి మౌన దీక్ష చేపట్టారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. శార్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత 25ఏళ్లుగా రఘువీరా ఉగాది రోజున మౌన దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కరోనా బారి నుంచి కాపాడాలని,  ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరువు, కాటకాల నుంచి ప్రజలను రక్షించాలన్నదే ఇవాళ్టి తన దీక్ష ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.


గతంలో మడకశిర మండల పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ముందు రఘువీరా మౌనదీక్ష చేపట్టేవారు. ఈ సంవత్సరం జనతా కర్ఫ్యూ కారణంగా స్వగ్రామం నీలకంఠాపురంలోని తన నివాసంలోని గాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించి  మౌన దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు పరిమిత సంఖ్యలో కుంటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read more