పాత పథకమే కొత్తపేరు.. సున్నా వడ్డీపై పంచుమర్తి

ABN , First Publish Date - 2020-04-24T21:45:50+05:30 IST

సున్నా వడ్డీ పథకంపై టీడీపీ సీనియర్ నేత పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు.

పాత పథకమే కొత్తపేరు.. సున్నా వడ్డీపై పంచుమర్తి

అమరావతి: సున్నా వడ్డీ పథకంపై టీడీపీ సీనియర్ నేత పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన సున్నా వడ్డీ కార్యక్రమాన్ని చంద్రబాబు కొనసాగించారని.. పాతదైన ఆ పథకాన్ని కొత్త సీసాలో పోసి వైఎస్ఆర్ పేరు పెట్టారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించిన ఆమె..  జగన్ మతం మోసం చెయ్యడం, కులం ఇచ్చిన మాట తప్పి సున్నం కొట్టడం అని తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు 4 దఫాల్లో డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సుమారు 27 వేల కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయన్నారు. మొదటి విడతగా సుమారు 7వేల కోట్లు రుణమాఫీ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రుణమాఫీ రత్నం ఊసేలేదన్నారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారని.. ఆ రత్నం కూడా మాయమయ్యిందన్నారు. మహిళల్ని నమ్మించి దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారన్నారు. 
Updated Date - 2020-04-24T21:45:50+05:30 IST