లాక్‌డౌన్‌ నేపథ్యంలో డీఎస్పీ ఔదార్యం.. యాచకులకు భోజన వసతి

ABN , First Publish Date - 2020-03-25T21:46:08+05:30 IST

కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇళ్లకే

లాక్‌డౌన్‌ నేపథ్యంలో డీఎస్పీ ఔదార్యం.. యాచకులకు భోజన వసతి

నందిగామ: కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుకాణాలు, హోటళ్లు బంద్ అయ్యాయి. దీంతో చాలా మంది యాచకులు తిండిలేక అలమటించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నందిగామ డీఏస్పీ రమణమూర్తి వారికి భోజన వసతి కల్పించారు. కంచికర్లలో రోడ్డుపక్కన ఆకలిబాధతో ఉన్న వారిని పలకరించి.. యాచకులకు భోజనం పొట్లాలను అందించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. డీఎస్పీ రమణమూర్తి ఔదార్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.  

Read more