నాగిరెడ్డి బతికుంటే చెంపదెబ్బ కొట్టేవాడు: ఏవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2020-06-06T16:42:19+05:30 IST

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు.

నాగిరెడ్డి బతికుంటే చెంపదెబ్బ కొట్టేవాడు: ఏవీ సుబ్బారెడ్డి

కర్నూల్: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆళ్లగడ్డ తన అడ్డా అనే భావనలో అఖిల ఉన్నదని, ఆమెకు తప్ప భూమా కుటుంబంలో ఎవరికి పగ్గాలు ఇచ్చినా సంతోషంగా ఉంటుందన్నారు. ఆమెకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఊరికే రాలేదని, తామంతా కష్టపడితే ఆమెకు ఆ స్థానం దక్కిందన్నారు. తమపై బాంబుల దాడి జరిగితే, ఆ దాడి నుంచి క్షేమంగా తప్పించుకున్నామని ఆ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రత్యర్థులతో పోరాడటంపై తనకు అఖిలప్రియ చెబుతున్నారని ఏవీ వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికీ ఏవీ సుబ్బారెడ్డిగానే బతుకుతున్నానని ఏ మారలేదన్నారు. చర్యకు ప్రతిచర్యకు ఉండాలని ఆరోజుల్లో పోరాడామని ఆన్నారు. 30ఏళ్ల చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.  తప్పు చేస్తే మౌనంగా అయినా ఉండాలని... పశ్చాత్తాపం చెందితే గౌరవంగా ఉంటుందున్నారు. సుపారీ ఇచ్చింది అఖిలప్రియ కాదని తెలిస్తే.. తనంత సంతోషించేవారు మరొకరు ఉండరన్నారు. నాగిరెడ్డి బతికుంటే అఖిలను చెంపదెబ్బ కొట్టేవారని వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి, ఏవీ వేరు కాదన్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారని.. అలా అనుకుంటే అది అఖిల భ్రమ అన్నారు. 35వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన రికార్డు అఖిలదని ఎద్దేవా చేశారు.  ఆళ్లగడ్డ రికార్డును అఖిల బ్రేక్ చేశారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-06T16:42:19+05:30 IST