అఖిలప్రియను అక్కా అనాలంటే అసహ్యమేస్తోంది: ఏవీ జస్వంతి

ABN , First Publish Date - 2020-06-06T17:00:36+05:30 IST

ఆళ్ళగడ్డలో అఖిలప్రియపై పోటీకి సిద్ధమని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు జస్వంతి ప్రకటించారు.

అఖిలప్రియను అక్కా అనాలంటే అసహ్యమేస్తోంది: ఏవీ జస్వంతి

కర్నూల్: ఆళ్ళగడ్డలో అఖిలప్రియపై పోటీకి సిద్ధమని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు జస్వంతి ప్రకటించారు. తమది ఆళ్ళగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆమె... స్వాగతించటానికి అఖిలప్రియ ఎవరు? అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందన్నారు. దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని ఆరోపించారు. తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోనని, ఆడపిల్లగా నాన్న లేని  పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు. కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదన్నారు. భూమా దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి 30ఏళ్ళ కష్టం వలనే అఖిలప్రియకు ఆ స్థాయి దక్కిందన్నారు. ఆమెది క్రిమినల్ మైండ్ అని, అఖిలప్రియ తీరు మహిళలకే సిగ్గుచేటన్నారు. తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50లక్షలా? అడ్డు వచ్చిన వారందర్నీ అఖిలప్రియ చంపుతోందా? అని ప్రశ్నించారు. 


Updated Date - 2020-06-06T17:00:36+05:30 IST