-
-
Home » Andhra Pradesh » Andhrapradesh Government
-
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ
ABN , First Publish Date - 2020-05-18T13:56:54+05:30 IST
అమరావతి: నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. 8 లక్షల క్వింటాళ్లకు పైగా ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేసింది.

అమరావతి: నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. 8 లక్షల క్వింటాళ్లకు పైగా ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేసింది. ఇ-క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు విత్తనాలు అందజేయనుంది. ఖరీఫ్ పంటకు 5,07,599 క్వింటాళ్ళ వేరుశనగ ... 2,28,732 క్వింటాళ్ల వరి... 88,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను సిద్దం చేసింది. పచ్చిరొట్ట పంటల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.13 రకాల వరి వంగడాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుంది. గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టికను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద వరి వంగడాలకు సబ్సిడీని రెట్టింపు చేశారు.