-
-
Home » Andhra Pradesh » andhrapradesh corona virus
-
ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-31T23:27:06+05:30 IST
ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు కాగా 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల 23 వేల 348కి కరోనా కేసులు చేరగా వారిలో 6,690 మరణించారు. రాష్ట్రంలో 24,575 యాక్టివ్ కేసులు ఉండగా..7 లక్షల 92 వేల 083 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 80.28 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందగా..గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అలాగే అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.