నన్ను డిశ్చార్జ్ చేయడం లేదు: ఏయూ విద్యార్థి

ABN , First Publish Date - 2020-08-13T03:48:57+05:30 IST

కుల వివక్షతకు వ్యతిరేకంగా తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారని ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ తెలిపాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి సోషల్

నన్ను డిశ్చార్జ్ చేయడం లేదు: ఏయూ విద్యార్థి

విశాఖపట్నం: కుల వివక్షతకు వ్యతిరేకంగా తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారని ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ తెలిపాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తన ఆరోగ్యం కుదుటపడినప్పటికీ తనను వైద్యులు డిశ్చార్జ్ చేయడం లేదని మహేష్ ఆరోపించాడు. కాగా, తనపట్ల ఏయూ అధికారులు వివక్ష చూపుతున్నారంటూ విద్యార్థి ఆరేటి మహేష్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-13T03:48:57+05:30 IST