కోస్తా, రాయలసీమలో వర్షాలు

ABN , First Publish Date - 2020-07-19T08:22:27+05:30 IST

నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల భారీవర్షాలు, చాలాచోట్ల

కోస్తా, రాయలసీమలో వర్షాలు

అమరావతి/విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల భారీవర్షాలు, చాలాచోట్ల తేలికపాటి వానలు కురిశాయి. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. శనివారం సాయంత్రం వరకు పెదకన్నాలి(చిత్తూరు జిల్లా)లో 9, నాగులపాడులో 6, పెదబయలు, ముండ్లమురులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-07-19T08:22:27+05:30 IST