మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం

ABN , First Publish Date - 2020-08-16T13:19:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొంది.

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొంది. మంత్రి తల్లి ఈశ్వరమ్మ (84) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈశ్వరమ్మ మరణంతో ఆ ఇంట విషాదం నెలకొంది. కుటుంబీకులు, బంధవులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈశ్వరమ్మ ఇకలేరన్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బొత్సాకు ఫోన్ చేసి పరామర్శించారు. 


విజయనగరంలోని స్వర్ఘధామంలో ఇవాళ మధ్యాహ్నాం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నేతలతో పాటు పలువురు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు కాగా రెండో కుమారుడు ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ గెలుపొందగా.. గజపతినగరం నియోజకవర్గం నుంచి నరసయ్య విజయం సాధించారు.Updated Date - 2020-08-16T13:19:13+05:30 IST