న్యాయవాదులకు ఆర్థిక సాయం: బార్‌ కౌన్సిల్‌

ABN , First Publish Date - 2020-04-07T11:02:09+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది.

న్యాయవాదులకు ఆర్థిక సాయం: బార్‌ కౌన్సిల్‌

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. అర్హులను గుర్తించేందుకు పదిమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.


సాయం పొందగోరే న్యాయవాదులు ఈ నెల 7 నుంచి 9వ తేదీ లోపు http://barcoun-cilap.org/financialassistancecovid19 వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 45 ఏళ్ల లోపు వయసు, 2010 జనవరి 1 తర్వాత ఎన్‌రోల్‌మెంట్‌ తీసుకుని ఉండడంతోపాటు, ఆధార్‌కార్డు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు ఏపీ బార్‌ కౌన్సిల్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

Read more