అనంతపురంలో ఆలయ గోపురం ధ్వంసం

ABN , First Publish Date - 2020-12-17T15:26:21+05:30 IST

చెన్నకేశవస్వామి గుడి గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

అనంతపురంలో ఆలయ గోపురం ధ్వంసం

అనంతపురం: నగరంలోని పాతవూరు చెన్నకేశవస్వామి గుడి గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గోపురాన్ని పగల గొడుతుండగా చూసిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. పురాతన ఆలయ గోపురం ధ్వంసంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోపల సెక్యూరిటీగా ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-17T15:26:21+05:30 IST