పునరావాస పరిహార ప్యాకేజి చెల్లింపుకు రూ.240 కోట్లు..
ABN , First Publish Date - 2020-10-03T12:22:42+05:30 IST
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాస పరిహార ప్యాకేజి చెల్లింపు కోసం..
అనంతపురం: జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాస పరిహార ప్యాకేజి చెల్లింపు కోసం రూ. 240 కోట్ల రూపాయల చెల్లింపునకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం పెంపు కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు జలవనరుల శాఖ ఈ మొత్తాన్ని చెల్లించనుంది. తాడిమర్రి, ముగుదిబ్బ మండలాల్లోని సీబీఆర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలోని 1729 కుటుంబాలకు, కట్టడాలకు పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.