ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ తాకట్టు !

ABN , First Publish Date - 2020-06-06T12:25:57+05:30 IST

ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ తాకట్టు !

ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ తాకట్టు !

అనంతపురం: తాకట్టుపెట్టిన సెల్‌ ఫోన్‌ను విడిపించుకోలేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగర శివారులో జరిగింది. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు... నగర శివారులో నివసిస్తున్న సాంబశివ, ఈశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు బెస్త విజయ్‌(18) బేల్దారీ పని చేసే వాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేసేవారు. విజయ్‌ కొన్ని రోజుల కిందట తన సెల్‌ఫోన్‌ను మరో వ్యక్తి వద్ద తాకట్టు పెట్టాడు. గడువు సమీపించడంతో దాన్ని విడిపించుకోవడానికి రూ. 6 వేలు డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను అడిగాడు. వారు నిరాకరించడంతో మనస్తాపం చెందిన విజయ్‌ శుక్రవారం ఉదయం ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-06T12:25:57+05:30 IST