అనంతపురం సర్వజన ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-09-07T02:37:42+05:30 IST

అనంతపురం : జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తృటిలో ప్రమాదం తప్పింది.

అనంతపురం సర్వజన ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం

అనంతపురం : జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోని ఎఫ్‌ఏం వార్డులో ఒక్కసారి ఆక్సిజన్ లీకేజ్ మొదలైంది. దీంతో ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది బయటికి పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది. లీక్ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ కలెక్టర్ సూర్య.. అగ్నిమాపక సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయని.. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. 


ఇదిలా ఉంటే.. ప్రభుత్వాస్పత్రిలో 10 రోజుల్లో రెండు ఘటనలు జరగడం గమనార్హం. గతంలో కరోనా బాధితులు ఉన్న పక్క వార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రభుత్వాస్పత్రిలో ఇలా వరుస ఘటనలు జరుగుతుండటంతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-09-07T02:37:42+05:30 IST