అనంతపురం: ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు

ABN , First Publish Date - 2020-06-06T12:48:54+05:30 IST

అనంతపురం: ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు

అనంతపురం: ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు

అనంతపురం: ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసుల జారీ అయ్యాయి. మనబడి నాడు-నేడు కింద చేపట్టిన పనుల పురోగతిలో అలసత్వం వహించడం పై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని కదిరి ఆర్‌డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ డీఈ గంగాధర్, హిందూపురం ఆర్‌డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ డీఈ మోహన్, చిలమత్తూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాధిక, నల్ల చెరువు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మద్దయ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


మనబడి నాడు-నేడు కింద చేపట్టిన పనుల పురోగతిపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించగా కదిరి ఆర్‌డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ డీఈ చిలమత్తూరు, నల్లచెరువు ఏఈలు సమీక్షకు హాజరుకాలేదు. అలాగే ఆయా మండలాల పరిధిలో మనబడి నాడు-నేడు కింద పనుల్లో కూడా పురోగతి చూపించక పోవడంతో ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నల్లచెరువు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మద్దయ్యకు షోకాజ్ నోటీస్‌తో పాటు ఒక ఇంక్రిమెంట్‌ను కట్ చేశారు. వీరు పనుల పురోగతిలో వెనుకబడడంతో పాటు సమీక్ష జరుగుతూ ఉండగానే మధ్యలో వెళ్లిపోయారు. హిందూపురం డీఈ పనుల పురోగతిలో వెనుకబడడంతో పాటు తన డివిజన్ పరిధిలోని సిబ్బందిని సమన్వయం చేసుకోలేదని గుర్తించడంతో  ఈ మేరకు వారందరికీ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2020-06-06T12:48:54+05:30 IST