అనంతపురం: క్వారంటైన్ కేంద్రంలో కలకలం

ABN , First Publish Date - 2020-05-09T16:59:10+05:30 IST

అనంతపురం: క్వారంటైన్ కేంద్రంలో కలకలం

అనంతపురం: క్వారంటైన్ కేంద్రంలో కలకలం

అనంతపురం: జిల్లాలోని విడపనకల్లు క్వారంటైన్ కేంద్రంలో కలకలం  రేగింది. శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతతో వృద్ధురాలు గోవిందమ్మ క్వారంటైన్ సెంటర్‌లోనే మృతి చెందింది. గోవిందమ్మ స్వగ్రామం విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామం. మూడు రోజుల క్రితం ముంబై నుంచి ప్రత్యేక ట్రైన్‌లో వలసకార్మికులు గుంతకల్‌కు చేరుకున్నారు. వారిని అధికారులు విడపనకల్లు మండలం కేంద్రానికి తరలించారు. కాగా వీరిలో గోవిందమ్మ అనే వృద్ధురాలు గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈరోజు తెల్లవారుజామున గోవిందమ్మ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు క్వారన్‌టైన్ కేంద్రానికి చేరుకుంటున్నారు. 

Updated Date - 2020-05-09T16:59:10+05:30 IST