అనంత: మసీదులో చోరీ...హుండీ బద్దలు కొట్టిన దుండగులు

ABN , First Publish Date - 2020-09-03T17:59:15+05:30 IST

రాయదుర్గం పట్టణంలోని కోట ప్రాంతంలో ఉన్న మసీదులో దుండగులు చోరీకి తెగబడ్డారు.

అనంత: మసీదులో చోరీ...హుండీ బద్దలు కొట్టిన దుండగులు

అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని కోట ప్రాంతంలో ఉన్న మసీదులో దుండగులు చోరీకి తెగబడ్డారు. గోడ దూకి మసీదులోకి ప్రవేశించిన దుండగులు హుండీ బద్దలు కొట్టి సొమ్ముతో పరారయ్యారు. రాయదుర్గం పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చోరీల నివారణలో పోలీసుల వైఫల్యం చెందారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-09-03T17:59:15+05:30 IST