హిందూపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2020-07-18T18:15:04+05:30 IST
హిందూపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..వ్యక్తికి గాయాలు

అనంతపురం: చెత్త విషయంలో జరిగిన గొడవ ఒకరిని ప్రాణాపాయస్థితిలోకి నెట్టింది. జిల్లాలోని హిందూపురం మండలం కిరికెరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న అశ్వతప్ప, నారాయణప్ప కుటుంబీకుల మధ్య చెత్త విషయంలో గొడవ చోటు చేసుకుంది. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నప్పటికీ...గత కొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చెత్త విషయంలో గొడవ చోటు చేసుకుంది. చాకలి నారాయణప్ప ఇంటి వారు అశ్వతప్ప ఇంటి వద్ద చెత్త వేయడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో కుటుంబాల మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. అశ్వతప్పపై చాకలి నారాయణప్ప, బాలు, రాకేష్ కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హిందూపురం ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.