అన్ని రాష్ట్రాల్లో రైతులకు సన్మానాలు జరుగుతుంటే.. ఏపీలో..: అనగాని
ABN , First Publish Date - 2020-11-03T16:33:59+05:30 IST
అన్ని రాష్ట్రాల్లో రైతులకు సన్మానాలు జరుగుతుంటే... ఏపీలో మాత్రం రైతులకు..
విజయవాడ: అన్ని రాష్ట్రాల్లో రైతులకు సన్మానాలు జరుగుతుంటే... ఏపీలో మాత్రం రైతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలిస్తున్నారని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అమరావతి రైతుల ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో దీక్షలు చేయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. జగన్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.