జగన్ పదే పదే కుల ప్రస్తావన తేవడం బాధాకరం: అనగాని
ABN , First Publish Date - 2020-08-20T15:27:11+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజికవర్గంపై ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. స్వర్ణా హోటల్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాయపాటి మమతను విచారణ పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు.
కమ్మ సామాజిక వర్గం వారు డాక్టర్లు, పోలీసులు, వ్యాపారవేత్తలు, రైతులుగా ఉండకూడదా? అని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులు అధికంగా ఉన్న అమరావతిని చంపేస్తున్నారన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారన్నారు. ముఖ్యమంత్రి కుల జాఢ్యాన్ని వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.