మహిళలకు అమూల్‌ వరం

ABN , First Publish Date - 2020-12-05T08:21:23+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభు త్వం అమూల్‌తో చేసుకొన్న ఒప్పందం మహిళలకు గొప్ప వరమని సీఎం జగన్‌ అన్నారు. ఈ ఒప్పందం వెనుక 3 కారణాలున్నాయన్నారు.

మహిళలకు అమూల్‌ వరం

పది రోజుల్లోనే ఖాతాల్లో నగదు.. లాభాల్లో ఏటా 2ు పాడిరైతులకు

బాబు హయాంలో మ్యాక్స్‌లోకి డెయిరీలు.. సొంత కంపెనీల్లా మార్చారు

శాసనసభలో సీఎం జగన్‌ వ్యాఖ్యలు

పదిరోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు


అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభు త్వం అమూల్‌తో చేసుకొన్న ఒప్పందం మహిళలకు గొప్ప వరమని సీఎం జగన్‌ అన్నారు. ఈ ఒప్పందం వెనుక 3 కారణాలున్నాయన్నారు. ‘‘పాల ఉత్పత్తిదారులు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమవుతారు.. రైతులకు అత్యుత్తమ ధర అందుతుంది.. వినియోగదారులకు నాణ్యమైన పాలు అందుతా యి’’ అని వివరించారు. ‘ఏపీలో పాడిపరిశ్రమ- అ మూల్‌తో భాగస్వామ్యం’ అనే అంశంపై శుక్రవా రం శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘అమూల్‌ కో-ఆపరేటివ్‌ బాడీ. పాలు పోసే వాళ్లే ఆ సంస్థకు యజమానులు. ఈ సంస్థకు వా టాదారులు లేరు. లాభాపేక్ష లేదు. రైతుల వద్ద నుంచి అత్యధిక ధరలకు పాలు కొనుగోలు చేసి, అత్యల్ప రేటుకు పాల ఉత్పత్తులను వినియోదారులకు అందిస్తోంది. వచ్చే ఆదాయంలో ఏటా 2ు రైతులకు బోనస్‌గా ఇస్తుంది’’ అన్నారు. గత ప్రభుత్వాల వల్ల కో-ఆపరేటివ్‌ వ్యవస్థ కూని అయిందని ఆరోపించారు. ‘‘డెయిరీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటంతో ఇష్టంవచ్చినట్లు రేట్లు నిర్ణయిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం కో-ఆపరేటివ్‌ వ్యవస్థను చంపేశారు. రాష్ట్రంలో 1974లో ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఏర్పడింది. 1981లో త్రీటైర్‌ కో-ఆపరేటివ్‌ వ్యవస్థ అమలులోకి వచ్చింది.


1995లో ఏపీ మ్యూచువల్లీ ఎయిడెడ్‌  కో-ఆపరేటివ్‌ యాక్ట్‌ను(మ్యాక్స్‌) అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. 1992లో చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. 1995 నుంచి 2003 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు డెయిరీలను కో-ఆపరేటివ్‌ వ్యవస్థ నుంచి మ్యాక్స్‌ పరిధిలోకి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరు డెయిరీలను అటు నుంచి ఇటు మార్పుచేశారు. మొత్తంగా చంద్రబాబు హయాంలో ఒక పద్ధతి ప్రకారం డెయిరీలను ప్రైవే టు కంపెనీలుగా మార్చేశారు. సంగం డెయిరీని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ఒక ప్రైవేటు సంస్థలా నడుపుతున్నారు. 


బీఎస్‌ నర్సింహులునాయుడు సహకారంలో హెరిటేజ్‌ కోసమని చిత్తూరు డెయిరీని మూసేశారు. అందుకు బహుమతిగా ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హెరిటేజ్‌ షేర్‌ విలువ విచిత్రంగా భారీగా పెరిగి, ఆయన ఓడిపోగానే పడిపోతోంది. హె రిటేజ్‌ షేర్లలో ఇది రిగ్గుంగులా కనిపిస్తోంది. 1999 జనవరి 1 వ తేదీన హెరిటేజ్‌ షేర్‌ రూ.2.89. 2003 నాటికి రూ.26.90 చేరింది. అప్పుడు చంద్రబాబు సీఎం. 2009 ఎన్నికలముందు షేర్‌ విలువ రూ.16.35కు పడిపోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో నడిచిన సైకిల్‌, హస్తం ప్రభుత్వంలో అది తిరిగి రూ.35 కి పెరిగింది. 2014లో చంద్రబాబు సీఎం అవ్వగానే ఒక్కసారిగా రూ.100కు పెరిగింది. 2017 డిసెంబర్‌ నాటికి రూ.827కు చేరింది. మళ్లీ 2020 మార్చి నాటికి హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.205కి పడిపోయింది’’ అని వివరించారు. రైతులకు బ్యాంక్‌లతో లోను ఇప్పించి, హెరిటేజ్‌కే పాలమ్మాలని ఒప్పందం చేసుకోవడం ఏమిటన్నారు.  అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం పట్ల పాడి మహిళలు సంతోషంగా ఉన్నారని సీ ఎం తెలిపారు.  ‘మా పశువులు అమ్ముకోవాలనుకున్నాం.. ఇప్పుడు అమూల్‌ వల్ల మాకు భవిష్యత్‌ కనిపిస్తోంది’ అని పాడి మహిళ చెబుతున్నారని వివరించారు. 


ఇకనుంచి అమూల్‌ అప్పలరాజు: స్పీకర్‌ చలోక్తి

అమూల్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో పశుసంవర్దక శాఖ మంత్రి అప్పలరాజు మాట్లాడుతుండగా.. సభాపతి తమ్మినేని సీతారం చతురోక్తి విసిరారు. ఇక నుంచి మీ పేరు అమూల్‌ బేబీ.. అమూల్‌ అప్పలరాజు అని నవ్వుతూ అన్నారు. 

Updated Date - 2020-12-05T08:21:23+05:30 IST