గవర్నర్‌ తొందరపడరని ఆశిస్తున్నాం

ABN , First Publish Date - 2020-07-20T08:34:52+05:30 IST

గతంలోని అనుభవాల దృష్ట్యా రాజధాని బిల్లులపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ లోతుగా అధ్యయనం చేయాలని ..

గవర్నర్‌ తొందరపడరని ఆశిస్తున్నాం

బిల్లులపై లోతైన అధ్యయనం జరగాలి

అమరావతి జేఏసీ గౌరవాధ్యక్షుడు శాస్త్రి


అమరావతి/విజయవాడ, జూలై 19(ఆంధ్రజ్యోతి): గతంలోని అనుభవాల దృష్ట్యా రాజధాని బిల్లులపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ లోతుగా అధ్యయనం చేయాలని అమరావతి జేఏసీ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జీవీఆర్‌ శాస్త్రి సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా అమరావతి జేఏసీ నేతలు, మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో తాము రాజ్యాంగ అధినేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నామని, వారికి ఇప్పటికే లేఖలు కూడా పంపామని తెలిపారు.


‘‘ గవర్నర్‌ రాజధాని బిల్లులను లోతుగా అధ్యయనం చేయాలి. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకోవాలి. గవర్నర్‌ తొందరపడరని ఆశిస్తున్నా’’ అని శాస్త్రి అన్నారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వారి నుంచి 33 వేల ఎకరాల భూమి తీసుకొని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అంత తేలికైన విషయం కాదన్నారు. కాగా, విదేశీ ట్రస్ట్‌ నుంచి రూ.70 వేల కోట్లు రుణం తీసుకోవడానికి కేంద్రాన్ని గ్యారంటీ అడిగిన ప్రభుత్వం, రైతులకు ఏ సావరిన్‌ గ్యారంటీ ఇచ్చి 34,323 ఎకరాల భూమిని తీసుకుందని ప్రశ్నించారు.  

Updated Date - 2020-07-20T08:34:52+05:30 IST