అమరావతే రాష్ట్ర రాజధాని

ABN , First Publish Date - 2020-12-10T09:35:50+05:30 IST

‘‘రాష్ట్ర రాజధాని అమరావతే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే. ఈ రెండింటిపై మా పార్టీ నిర్ణయం ఇదే’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాజెక్టులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. 2024లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాజెక్టులకు

అమరావతే రాష్ట్ర రాజధాని

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే

వైసీపీ, టీడీపీ కమీషన్‌ పార్టీలు: సోము వీర్రాజు


అనంతపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర రాజధాని అమరావతే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే. ఈ రెండింటిపై మా పార్టీ నిర్ణయం ఇదే’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాజెక్టులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. 2024లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాజెక్టులకు పోలవరంలాగే నిధులు కేటాయిస్తామన్నారు. రాయలసీమ నికర జలాల కోసం ఈ ప్రభుత్వంతో, బీజేపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు.  టీడీపీ, వైసీపీలు కమీషన్‌ పార్టీలని ఆరోపించారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  

Updated Date - 2020-12-10T09:35:50+05:30 IST