న్యాయదేవతే మాకు రక్ష!

ABN , First Publish Date - 2020-05-30T07:54:22+05:30 IST

అతి త్వరలో అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అన్న తీపికబురు వింటామని రాజధానికి భూములిచ్చిన రైతులు ..

న్యాయదేవతే మాకు రక్ష!

164వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): అతి త్వరలో అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అన్న తీపికబురు వింటామని రాజధానికి భూములిచ్చిన రైతులు ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 164వ రోజుకు చేరాయి. మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో 29 గ్రామాల రైతులు, మహిళలు, కూలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


అధికారులు రాజధాని అంశం కోర్టుల్లో, మండలిలో ఉందని చెబుతుంటే.. పారిశ్రామిక ప్రగతిపై సీఎం జగన్‌ గురువారం మాట్లాడుతూ విశాఖ త్వరలో పరిపాలన రాజధానిగా మారుతుందని చెబుతున్నారని ఇది కోర్టు ధిక్కారం కాదా అంటూ నిలదీశారు.   ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ వలెనే తమకూ న్యాయస్థానం ద్వారానే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ న్యాయదేవతే తమకు రక్ష అని స్పష్టంచేశారు.  

Updated Date - 2020-05-30T07:54:22+05:30 IST