-
-
Home » Andhra Pradesh » Amravati farmers
-
రాజధాని రైతుల నిరసన
ABN , First Publish Date - 2020-12-07T01:59:38+05:30 IST
జధాని కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు చేస్తున్న దీక్షలు 355వ రోజుకు చేరాయి.

అమరావతి: రాజధాని కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు చేస్తున్న దీక్షలు 355వ రోజుకు చేరాయి. ఆదివారం తుళ్లూరు శిబిరం వద్ద రాజధాని రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. అలాగే తులసి థియేటర్ సెంటర్ వద్ద అష్టదిగ్భంధనం చేసి ధర్నా చేపట్టారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని రైతులు డిమాండు చేస్తున్నారు.