ప్రభుత్వం మారితే రాజధానిని మారుస్తారా?
ABN , First Publish Date - 2020-05-29T07:52:40+05:30 IST
ప్రభుత్వం మారితే రాజధానిని మారుస్తారా?

- 163వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతుల ధ్వజం
గుంటూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ప్రశ్నించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 163వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ 29 గ్రామాల రైతులు, మహిళలు, కూలీలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. అమరావతితోనే వెలుగంటూ అమరావతి వెలుగు కార్యక్రమం కింద దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు.