రాజధాని పోరు ఆపం!

ABN , First Publish Date - 2020-06-23T09:34:47+05:30 IST

సీఎం జగన్‌ నోటి నుంచి ‘ఏపీకి అమరావతే ఏకైక రాజధాని’ అనే స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరు ఆగదని ఆ ప్రాంత రైతులు, కూలీలు,

రాజధాని పోరు ఆపం!

  • 188వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ నోటి నుంచి ‘ఏపీకి అమరావతే ఏకైక రాజధాని’ అనే స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరు ఆగదని ఆ ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు నినదించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 188వ రోజుకు చేరాయి. దివంగత కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ భవనాల సముదాయం ప్రాంతంలో దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య, మైనారిటీ నేత షేక్‌ సాహెబ్‌జాన్‌లు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చిత్రపటాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘‘అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం ప్రతిపాదించారు. బయటకు వచ్చి మంత్రుల చేత ప్రస్తుతానికి రాజధాని తరలించడం లేదంటారు.


ఇది మాతో పాటు ప్రజలను మోసం చేయటం కాదా?’’ అని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానం అన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఆ శ్మశానంలో ఏ పని ఉండి వచ్చా రు? ప్రజలను మోసం చేయడానికి వచ్చారా? అని నిలదీశారు. కాగా, ఇంటింటా అమరావతి కార్యక్రమం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 సమయంలో ఇళ్లలో విద్యుత్‌ నిలిపివేసి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరుస పర్యటనలు రైతుల్లో అనేక సందేహాలు లేవనెత్తున్నాయి.

Updated Date - 2020-06-23T09:34:47+05:30 IST