అమరావతికి రాజకీయ గ్రహణం పట్టింది

ABN , First Publish Date - 2020-06-22T08:41:18+05:30 IST

సంవత్సరం క్రితం లక్షలాది కార్మికులతో, పెద్ద యంత్రాలతో రాత్రింబవళ్లు కళకళలాడిన అమరావతికి నేడు రాజకీయ గ్రహణం పట్టిందని

అమరావతికి రాజకీయ గ్రహణం పట్టింది

  • రాజధాని రైతుల ఆవేదన
  • 187వ రోజు కొనసాగిన ఆందోళనలు

గుంటూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సంవత్సరం క్రితం లక్షలాది కార్మికులతో, పెద్ద యంత్రాలతో రాత్రింబవళ్లు కళకళలాడిన అమరావతికి నేడు రాజకీయ గ్రహణం పట్టిందని రాజధాని రైతులు అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 187వ రోజుకు చేరాయి.  అమరావతికి పట్టిన రాజకీయ గ్రహణంతో  తమ జీవితాలలో చీకటి నెలకొందని 29 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటా అమరావతి కార్యక్రమం కింద ఇళ్లలో రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చాము కాని రాజకీయ పార్టీలకు కాదని...


సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఏపీ పరిరక్షణ జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ నేతృత్వంలో మందడం, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు ఇళ్లలోని విద్యుత్‌ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. అమరావతి రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Updated Date - 2020-06-22T08:41:18+05:30 IST