కులాల కుంపటి రాజేస్తున్నారు
ABN , First Publish Date - 2020-09-01T10:06:49+05:30 IST
కులాల కుంపటి రాజేసి ఐకమత్యాన్ని చెడగొట్టి.. ఉద్యమాన్ని నీరు కార్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు

- అసైన్డ్ రైతులకు కౌలు ఎందుకివ్వరు?
- 258వ రోజు అమరావతి ఆందోళన
గుంటూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కులాల కుంపటి రాజేసి ఐకమత్యాన్ని చెడగొట్టి.. ఉద్యమాన్ని నీరు కార్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయడంతో పనులు లేక, వ్యవసాయం లేక భూములిచ్చిన అసైన్డ్ రైతులు ఆకలి బాధలు పడుతుంటే వారికి ఇవ్వాల్సిన కౌలు ఎందుకు ఇవ్వరంటూ రైతులు నిలదీశారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 258వ రోజుకు చేరాయి. అమరావతిలో అడుగడుగునా రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ అనంతవరం రైతులు, మహిళలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు.