LIVE: ఏపీ హైకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా సంచలనం

ABN , First Publish Date - 2020-05-27T13:31:52+05:30 IST

LIVE: ఏపీ హైకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా సంచలనం

LIVE: ఏపీ హైకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా సంచలనం

అమరావతి: న్యాయమూర్తులు, వారి తీర్పులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన  వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు మొత్తం 49 మందిపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయడంతో పాటు వీరందరికీ నోటీసులు పంపించాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ డాక్టర్ మాస్కులు అడిగితే సస్పెండ్ చేస్తారు.  ఆ తరువాత ఆయన రోడ్డుపై కనిపిస్తే ఆయనకు మతిస్తిమితం లేదంటూ హాస్పటల్‌లో జాయిన్ చేస్తారు. ఆ కేసులు విచారించి ప్రభుత్వం చెప్పిన వాదనకు అక్కడ జరిగిందానికి పొంతన లేదంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆ కేసును సీబీఐకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇది చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోపం తెప్పించింది. ఆ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా కామెంట్ చేస్తూ, హైకోర్టుకు కులాలను ఆపాదిస్తూ కామెంట్లు చేశారు. కొంతమంది బాధ్యతగల ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి కోర్టులను ఎవరో ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. దీనికి కోర్టు ధిక్కారణ కింద హైకోర్టు పరిగణించింది. దాదాపు 49 మందికి నోటీసులు ఇచ్చింది. ఇంకా కొంత మందికి కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో నిర్వహించిన చర్చలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ యశస్వి పాలవలస, బీజేపీ నేత రామకోటయ్య, టీడీపీ నేత జవహర్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-05-27T13:31:52+05:30 IST