అతి భీకర తుఫానుగా ఆంఫన్

ABN , First Publish Date - 2020-05-18T16:10:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఆంఫన్ తుపాన్ గండం పొంచి ఉంది.

అతి భీకర తుఫానుగా ఆంఫన్

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ఆంఫన్ తుపాన్ గండం పొంచి ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళఖాతంలో కేంద్రీకృతమైన ఆంఫన్ పెను తుపాన్‌గా మారనుంది. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు పడే అవకాశముంది. ఆంఫన్ తుపాన్ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దశల్లో బలపడింది. పారాదీప్‌కు దక్షిణంగా 925 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని డిఘాకు దక్షిణ నైరుతిగా 1,108కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెనుతుపాన్‌గా మారనుంది. ఈ క్రమంలో తొలుత నెమ్మదిగా 12 గంటలపాటు ఉత్తరదిశగా పయనించి.. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుంది. తర్వాత వేగం పెంచుకుంటూ వాయువ్య బంగాళఖాతంలోకి ప్రవేశిస్తుందని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-05-18T16:10:45+05:30 IST