‘అమ్మ ఒడి’ 14 వేలే!
ABN , First Publish Date - 2020-12-29T08:26:08+05:30 IST
2020-21 విద్యాసంవత్సరానికి ‘అమ్మ ఒడి’ అమలుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): 2020-21 విద్యాసంవత్సరానికి ‘అమ్మ ఒడి’ అమలుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుం చి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల త ల్లులకు జనవరి 9న ‘అమ్మఒడి’ కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొం ది. అయితే, ఖాతాల్లో మాత్రం రూ.14 వేలు మాత్రమే జమచేయనున్నట్టు తెలిపింది. మిగిలిన రూ.వెయి పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధి కింది మినహాయించనున్నట్టు పే ర్కొంది. కాగా, 2019-20 విద్యా సంవత్సరంలో ఈ సాయం అందుకున్న విద్యార్థులందరూ ప్ర స్తుత సంవత్సరానికి కూడా అర్హులేనని స్పష్టం చేసింది. కొవిడ్-19 కారణంగా విద్యార్థులందరికీ 75ు హాజరు నిబంధనను మినహాయించారు.
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న తల్లుల ఖాతాల్లో కూడా రూ.14 వేల నే జమ చేయనున్నట్లు పేర్కొంది. రూ. 1000 జిల్లా మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేయనున్నట్లు తెలిపింది. 2019-20 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదివి, ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందని విద్యార్థులు కూడా ‘అమ్మ ఒడి’ పథకానికి అర్హులేనని స్పష్టం చేసింది. అయితే, ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ కోర్సులు ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున అమ్మ ఒడి వర్తించదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో వివరించింది.