అమిత్‌‌షాను కలిసిన జీవీఎల్‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌

ABN , First Publish Date - 2020-03-13T21:29:15+05:30 IST

కేంద్రమంత్రి అమిత్‌‌షాను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ కలిశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులు.. వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.

అమిత్‌‌షాను కలిసిన జీవీఎల్‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌

ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌‌షాను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు‌, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ కలిశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులు.. వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. అమిత్‌షాకి లేఖ ఇచ్చామని, వైసీపీ దాడులు, అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికల అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారని, నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. కోర్టు చెప్పినా వైసీపీ పార్టీ రంగులను తొలగించలేదని, ఎన్నికల సంఘం, డీజీపీ సరైన తీరులో స్పందించకపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని జీవీఎల్‌
 చెప్పారు. 

Updated Date - 2020-03-13T21:29:15+05:30 IST