-
-
Home » Andhra Pradesh » AMERICAN IN POLICE CUSTODY
-
పోలీసుల అదుపులో అమెరికా వాసి
ABN , First Publish Date - 2020-03-25T08:18:43+05:30 IST
కరోనా దెబ్బకు విదేశాల నుంచి వచ్చిన వారంటే అనుమానంగా చూసే పరిస్థితి! రాజమహేంద్రవరంలో ఇలాంటి ఘటనే...

- కరోనా అనుమానంతో ఆస్పత్రికి తరలింపు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24: కరోనా దెబ్బకు విదేశాల నుంచి వచ్చిన వారంటే అనుమానంగా చూసే పరిస్థితి! రాజమహేంద్రవరంలో ఇలాంటి ఘటనే జరిగింది. స్కూటర్‌పై తిరుగుతున్న ఓ అమెరికా పౌరుడిని పోలీసులు బొమ్మూరు క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అతడు 2 నెలల క్రితమే ఇక్కడికొచ్చినట్టు తెలిసింది. అతనితోపాటు ఉన్న స్థానిక యువకుడికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
క్వారంటైన్‌లో చైనా ఉద్యోగి
వరదయ్యపాళెం, మార్చి 24: శ్రీసిటీలోని చైనాకు చెందిన ఓ పరిశ్రమ ఉద్యోగి రెండు రోజుల క్రితం ఆ ఉద్యోగి భారత్‌కు వచ్చాడు. పోలీసులు మంగళవారం అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయినా.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.