5 నుంచి ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-17T09:27:32+05:30 IST

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ(సీబీసీఎస్‌) ఆరో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 5 నుంచి 10 వరకు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు

5 నుంచి ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ(సీబీసీఎస్‌) ఆరో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 5 నుంచి 10 వరకు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 11 నుంచి 16 వరకు, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నవంబరు 7 నుంచి 13 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా డిగ్రీ(ఓల్డ్‌ బ్యాచ్‌) మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబరు 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబరు 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-17T09:27:32+05:30 IST