శాకమూరులో అంబేద్కర్ స్మృ‌తివనం ఏర్పాటు చేయాలి: టీడీపీ

ABN , First Publish Date - 2020-07-08T20:47:55+05:30 IST

శాకమూరులో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని టీడీపీ దళిత నేతలు డిమాండ్ చేశారు.

శాకమూరులో అంబేద్కర్ స్మృ‌తివనం ఏర్పాటు చేయాలి: టీడీపీ

విజయవాడ: శాకమూరులో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని, విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతమైన శాకమూరులో  ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతి వనాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. 


ఈ సందర్బంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అసలు ప్రభుత్వం స్మృతి వనాన్ని తరలించబోతుందా?  అక్కడ కొత్తగా స్మృతి వనం నిర్మించబోతుందా? అనేది క్లారిటీ లేదన్నారు. స్మృతివనం ఏర్పాటు అంటే.. 155 జయంతి ఉత్సవాలను పురష్కరించుకుని, రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ మహనీయుడి గొప్పతనం గురించి మాట్లాడాలని ఆనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందన్నారు. ఆరోజు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్ చూస్తూ వెళ్లిపోయిందన్నారు. మిగిలిన పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆనందబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-08T20:47:55+05:30 IST