-
-
Home » Andhra Pradesh » amarvathi andhrapradesh capital
-
అమరావతి ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-12-06T23:46:59+05:30 IST
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటిపై అమరావతి మహిళా రైతులు రాళ్లు వేశారని ఆరోపిస్తూ...

అమరావతి: ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటిపై అమరావతి మహిళా రైతులు రాళ్లు వేశారని ఆరోపిస్తూ బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంపీ ఇంటిపై రాళ్లు వేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అమరావతి రైతుల శిబిరం వైపు దూసుకెళ్లారు. దీంతో అమరావతి మహిళా రైతులు, బహుజన పరిరక్షణ సమితి సభ్యులు పరస్పరం దూషించుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపు చేశారు.
కాగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు సుమారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులను కావాలంటూ బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఉద్దండరాయుని పాలెంలో భయాందోళనలు నెలకొన్నాయి.