అమరావతిని ఆపగలరా..?.

ABN , First Publish Date - 2020-12-16T01:54:22+05:30 IST

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యయం ఏడాది పూర్తి చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి..

అమరావతిని ఆపగలరా..?.

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యయం ఏడాది పూర్తి చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు ఉండాలని తీర్మానించారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టారు. బిల్లుకు మద్దతుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపగా విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.  ఈ పరిణామాలతో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి నుంచి ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో అమరావతికి మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజధానిగా అమరావతిని సాధించే వరకు పోరాటం చేస్తామని రైతులు అంటున్నారు.


ఈ నేపథ్యంలో ‘‘వికృత క్రీడలో అమరావతి నిలిచి గెలుస్తుందా..?. అమరావతి విషయంలో కొన్ని పార్టీలు దొంగాట ఆడుతున్నాయా..?. ప్రజా ఉద్యమంలోకి పార్టీలు ఎందుకు దూకడం లేదు..?. మూడు రాజధానులపై జగన్ ఇంకా సీరియస్‌గానే ఉన్నారా..?. అది జరగదు- ఇది ఆగదు అనే తత్వం బోధపడలేదా..?. ప్రజా ఉద్యమంలోకి పార్టీలు ఎందుకు దూకడంలేదు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2020-12-16T01:54:22+05:30 IST