సిట్ వేశారు...ఏమి తేల్చారు: జేఏసీ కన్వీనర్

ABN , First Publish Date - 2020-09-13T21:40:13+05:30 IST

సిట్ వేశారు...ఏమి తేల్చారు: జేఏసీ కన్వీనర్

సిట్ వేశారు...ఏమి తేల్చారు: జేఏసీ కన్వీనర్

అమరావతి: నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే...ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుందని జేఏసీ కన్వీనర్ మార్టిన్ ప్రశ్నించారు.జగన్ చేతిలో బొత్స బలిపశువు కాబోతున్నాడన్నారు. రాజధానిలో ఉండే ఎస్సీ రైతుల నోట్లో ఈ ప్రభుత్వం మట్టి కొట్టిందని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిట్ వేశారు...ఏమి తేల్చిందన్నారు. అమరావతిని నాశనం చేయడానికి సీఎం, మంత్రులు కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి దళితులే సమాధి కట్టే సమయం ఆసన్నమైందన్నారు. రాజధాని రైతుల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-13T21:40:13+05:30 IST