-
-
Home » Andhra Pradesh » amaravati
-
విజయవాడలో నేడు మహా పాదయాత్ర
ABN , First Publish Date - 2020-12-15T12:35:51+05:30 IST
విజయవాడలో నేడు మహా పాదయాత్ర

అమరావతి, (ఆంధ్రజ్యోతి): అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో మంగళవారం విజయవాడలో ‘అమరావతి పరిరక్షణ మహా పాదయాత్ర’ జరగనుంది. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) పిలుపు మేరకు మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడలోని బీఆర్డీఎస్ రహదారిపై పడవల రేవు కూడలి నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు భారీ ఎత్తున ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనిలో రాఽజధాని రైతులు, ప్రజలతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారని జేఏసీ తెలిపింది. ఉదయం కలెక్టర్, తహసీల్దార్లకు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ వినతిపత్రాలను ఇవ్వనున్నారు. కాగా, పాదయాత్రకు మద్దతు తెలపాలని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను జేఏసీ నేతలు కోరారు.