ఆంధ్రుల రాజధాని అమరావతే

ABN , First Publish Date - 2020-07-15T08:16:58+05:30 IST

ఆంధ్రుల రాజధాని అమరావతేనని రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, దళిత జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 210వ రోజుకు చేరుకున్నాయి...

ఆంధ్రుల రాజధాని అమరావతే

  • 210వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు


తుళ్లూరు, జూలై 14: ఆంధ్రుల రాజధాని అమరావతేనని రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, దళిత జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 210వ రోజుకు చేరుకున్నాయి. మందడం, దొండపాడు, బోరుపాలెం, అనంతవరం, తుళ్లూరు, నెక్కల్లు, పెదపరిమి శాఖమూరు, ఐనవోలు, వెలగపూడి, రాయపూడి తదితర గ్రామాల రైతులు ఇళ్ల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా ఉన్నామని,  బయటకు రాకుండా ఇళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నామన్నారు.


చట్టబద్ధంగా రాజధానికి భూములిస్తే పాలకులు రోడ్డున పడేయటం దారుణమన్నారు.  ప్రభుత్వం అన్యాయం చేయాలని అడుగడుగునా ప్రయత్నిస్తున్నదన్నారు. రాజధాని అమరావతి ఉంటేనే అందరికీ గౌరవం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.  మూడు రాజధానుల వల్ల ముప్పు తప్పితే లాభం ఉండదన్నారు. 


Updated Date - 2020-07-15T08:16:58+05:30 IST