హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-07-29T18:14:47+05:30 IST

హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

అమరావతి: హైస్కూల్ ప్లే గ్రౌండ్‌లో రైతుభరోసా కేంద్రం నిర్మాణంపై ఏపీ హైకోర్ట్ స్టే విధించింది. విజయనగరం జిల్లా కొత్త చందులూరు గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఆటస్థలంలో రైతుభరోసా కేంద్రం నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం గ్రౌండ్‌లో ఎటువంటి నిర్మాణం చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-07-29T18:14:47+05:30 IST