మా ఆవేదనను సీఎం కూడా అర్ధం చేసుకోవాలి: అమరావతి రైతులు
ABN , First Publish Date - 2020-05-15T16:32:18+05:30 IST
మా ఆవేదనను సీఎం కూడా అర్ధం చేసుకోవాలి: అమరావతి రైతులు
అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన అమరావతి ఉద్యమం 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ప్రధాని స్పందించాలని విజ్ఞప్తులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. దాసు అనే రైతు అరటి బోదెలతో గుడి కట్టి.. మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడిన మోదీ... అమరావతి రాజధానిగా ఉంచి ఏపీ ప్రజలకు అండగా నిలవాలని కోరారు. 150 రోజులుగా ఉద్యమం చేస్తున్న తమ ఆవేదనను సీఎం జగన్ కూడా అర్ధం చేసుకోవాలి అంటూ అమరావతి రైతులు కోరుతున్నారు.