264వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-06T14:34:26+05:30 IST

రాజధాని గ్రామాల ప్రజల నిరసనలు 264వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెళగపూడి, తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా

264వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన

అమరావతి: రాజధాని గ్రామాల ప్రజల నిరసనలు 264వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెళగపూడి, తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని రాజధాని ప్రాంత వాసులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-06T14:34:26+05:30 IST