ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీకి బకాయిలు చెల్లించండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-06-25T15:02:45+05:30 IST

ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీకి బకాయిలు చెల్లించండి: రామకృష్ణ

ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీకి బకాయిలు చెల్లించండి: రామకృష్ణ

అమరావతి: ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీకి ఆర్టీసీ మేనేజ్మెంట్ చెల్లించాల్సిన రు.260కోట్ల బకాయిలను వడ్డీతో సహా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. 1952లో ఏర్పడిన ఈ సొసైటీ ఆసియాలోనే అత్యుత్తమ సొసైటీగా పేరుగాంచిందని తెలిపారు. సర్వీస్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి ఈ సొసైటీ ఎంతో దోహదపడుతుందని పేర్కన్నారు. మార్చి నెల నుండి రుణాలు మంజూరుకాక ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్టీసీలో 7500 మంది అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా విధుల్లో కొనసాగించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-25T15:02:45+05:30 IST