ఏపీలో నేటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-20T13:57:04+05:30 IST

రాష్ట్రంలో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు నేటి నుంచి పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీలో నేటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు

అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు నేటి నుంచి పరీక్షలు జరుగనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల 12 గంటల వరకు...మధ్యాహ్నం 2 గంటల నుంచి 4  పరీక్షలు జరుగనున్నాయి. 


పశ్చిమగోదావరి: జిల్లాలో 1049 సచివాలయ పోస్టుల భర్తీకి నేటి నుండి పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 122 సెంటర్లలో 74,711 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.  ఈ ఒక్కరోజే అత్యధికంగా 34,249 మంది అభ్యర్థులు  కేటగిరీ 1 పరీక్షను  రాయనున్నారు. కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా,  కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతినిచ్చారు.


విశాఖపట్నం: జిల్లాలో  మొత్తం 1,585 పోస్టులు కాగా... 1,50,441 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.  మొత్తం 277 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రం వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో అధికారులు పలు నిబంధనలు విధించారు. 

Updated Date - 2020-09-20T13:57:04+05:30 IST